రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం 1985’ టైటిల్ వెనుక రహస్యం ఇదే
June 10, 2017 / 09:16 AM IST
|Follow Us
ధృవ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇందులో సమంత నటిస్తుండడంతో క్రేజ్ పెరిగింది. సుకుమార్ డైరక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. నిన్న ఈ మూవీ పేరుని ప్రకటించారు. ”రంగస్థలం 1985” అనే టైటిల్ ని రిలీజ్ చేసిన వెంటనే కొన్ని గంటలకే సోషల్ మీడియా వరల్డ్ వైడ్ ట్రెండ్లలో 45 వ స్థానం లో నిలిచింది. ఇక టైటిల్ వెనుక పెద్ద స్టోరీ ఉందని అభిమానులు చెబుతున్నారు. అందులో ఒకటి 1985. ఆ సంవత్సరంలోనే చెర్రీ జన్మించారు.
RAngasthalaM టైటిల్ లో ఉన్న మొదటి రెండు అక్షరాలు పేరు చివరి అక్షరం కలిప్తే RAM అనే పదం వస్తుంది. మరో విషయం ఏమిటంటే సమంత పేరు కూడా టైటిల్ లో ఉంది. టైటిల్ లో ఉన్న అక్షరాలును అటు ఇటు చేస్తే Samantha అనే పేరు వస్తుంది. సో ఇలా అభిమానులు టైటిల్ పై ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. సుకుమార్ టీమ్ ఈ టైటిల్ వెనుక స్టోరీలపై స్పందించలేదు, కానీ కథకు సూటయ్యే టైటిల్ అని చెబుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.