శేఖర్ కమ్ముల పై కోపంతో కల్యాణ్ అభిమానులు!

  • July 25, 2017 / 05:49 AM IST

పవన్ కల్యాణ్ ఫాన్స్ దర్శకుడు శేఖర్ కమ్ముల పై కోపంగా ఉన్నారు…దానికి కారణం శేఖర్ కమ్ముల ఇచ్చిన స్టేట్మెంట్…అసలు విషయం ఏంటి? పవన్ పై శేఖర్ ఏమన్నాడు? ఫిదా సినిమాలో పవన్ ఇమేజ్ ను బాగానే వాడాడు కదా…అంటే… ఒక్కసారి ఈ కధ చదవండి…పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే దాదాపుగా దైవంతో సమానం అతని అభిమానులకి..పవన్ ను ఏమీ అనక్కర్లేదు…అతనితో ఎవరినైనా పోల్చిన చాలు చెలరేగిపోతారు ఆయన ఫాన్స్…అయితే అదే తప్పు ఇప్పుడు ఫిదా సినిమాని పురస్కరించుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల చేశాడు…అయితే శేఖర్ ఏం చేశాడు…పవన్ ఫ్యాన్స్ కి ఎందుకు కోపం అంటే…కారణం…వరుణ్ తేజ్ ను పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ శేఖర్ కమ్ముల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చెయ్యడమే….ఏం కామెంట్స్ అంటే…మీరే చదవండి…పవన్ తన కెరియర్ ప్రారంభంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో చేసినట్లుగా వరుణ్ తేజ్ కూడ ‘ఫిదా’ లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో నటించి ఘన విజయం అందుకోవడమే కాకుండా పవన్ వారసత్వాన్ని ఈ విషయంలో కొనసాగిస్తున్నాడు అంటూ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అంతేకాదు కెరియర్ తొలిరోజులలో నటించిన ‘గోకులంలో సీత’ ‘సుస్వాగతం’ ‘తొలి ప్రేమ’ సినిమాలలో హీరోయిన్ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లుగానే ‘ఫిదా’ లో కూడ హీరోయిన్ పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అన్న కామెంట్స్ చేసాడు శేఖర్ కమ్ముల.

అంతేకాదు పవన్ తన కెరియర్ తొలిరోజులలో ఒక ప్రేమికుడుగా మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించి మెప్పించిన విధంగా అటువంటి పాత్రలు వరుణ్ తేజ్ కు బాగా కలిసివస్తాయి అని కామెంట్స్ చేసాడు. అదేవిధంగా పవన్ ప్రేమికుడి పాత్రల నుండి మాస్ హీరోగా ఎదిగినట్లుగా రానున్న రోజులలో పవన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వరుణ్ తేజ్ ఒక టాప్ మాస్ హీరోగా మారబోతున్నాడు అన్న సంకేతాలు ఇచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులను కలిగిన పవన్ తో పోలుస్తూ అత్యుత్సాహంతో శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పించిందట…అసలే మెగా ఫ్యామిలీలో రెండు వర్గాల వార్ కొనసాగుతూ ఉండడంతో ఇప్పుడు శేఖర్ స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారింది…చూద్దాం మరి ఈ మ్యాటర్ ఎంతవరకూ పోతుందో…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus