Sekhar: రాకేష్ మాస్టర్ నా గురువు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా!
June 29, 2023 / 08:55 PM IST
|Follow Us
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన పెద్దకర్మ వేడుకను హైదరాబాదులో ఆయన శిష్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ సమక్షంలో రాకేష్ మాస్టర్ పెద్దకర్మ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన శిష్యులు అలాగే వైవిఎస్ చౌదరి వంటి వారు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాకేష్ మాస్టర్ శిష్యులందరూ కలిసి ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది జాతీయ పురస్కారాలను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా (Sekhar) శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ గారితో తనకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉందని తెలిపారు.ఆయన ఒక గొప్ప డాన్సర్ ఆయన డాన్స్ కు సంబంధించి యూట్యూబ్లో మీరు చూసినది కేవలం ఐదు శాతం మాత్రమేనని తెలిపారు. ఆయన టాలెంట్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
తాను కూడా మొదట్లో ప్రభుదేవా మాస్టర్ ను స్ఫూర్తిగా తీసుకున్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ కు చాలా అభిమానిగా మారిపోయానని తెలిపారు.ఇక డాన్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగిన మాస్టర్ అస్సలు ఊరుకునేవారు కాదని తెలిపారు. అలా ఆయన క్రమశిక్షణ నేడు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు.. తాను రాకేష్ మాస్టర్ వంటి గురువుకి శిష్యుడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
ఇక ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నానే తప్ప ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని శేఖర్ మాస్టర్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యూట్యూబ్ ఛానల్ లకు కూడా చిన్న రిక్వెస్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ పెట్టే థంబ్ నెయిల్స్ కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీరు ఏం రాసిన నిజాలు తెలుసుకొని మాత్రమే రాయండి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.