Selvamani, Pooja Hegde: పాన్ ఇండియా హీరోయిన్ నిర్మాతలకు భారమవుతోందా?
August 19, 2021 / 03:07 PM IST
|Follow Us
ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియాల సీజన్ నడుస్తోంది. మామూలుగానే బాలీవుడ్ సినిమాలను పాన్ ఇండియా అనుకుంటారు. అది పక్కనపెడితే తెలుగు, తమిళంలో పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని ముఖ్యమైన సినిమాల్లో కామన్ పాయింట్ పూజా హెగ్డే. అందుకే కొంతమంది ఆమెను పాన్ ఇండియా హీరోయిన్ అని అంటున్నారు. అయితే రేంజి పెరిగాక పూజా హెగ్డే లెవల్ చూపిస్తోందని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్.కె. సెల్వమణి షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడా కామెంట్స్ వైరల్‌గా మారాయి.
పూజా హెగ్డే ప్రస్తుతం… రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ ‘భీస్ట్’లో నటిస్తోంది. ఈ క్రమంలో మూడు ఇండస్ట్రీలను షటిల్ సర్వీసుల్లా చుట్టేస్తోంది. అయితే ఆమె రేంజితోపాటు ఆమె అసిస్టెంట్ల సంఖ్య కూడా పెరిగిందట. తొలినాళ్లలో పూజా హెగ్డేతోపాటు ఒక్క అసిస్టెంట్ మాత్రమే వచ్చేవాడట. ప్రస్తుత పది, పన్నెండు మంది అసిస్టెంట్లు ఆమెతో పాటు ఉంటున్నారని ఆర్.కె.సెల్వమణి అన్నారు అంటూ ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూజ చేస్తున్న పని వల్ల నిర్మాతల మీద అదనపు భారం పడుతోందని చెబుతున్నారు.
స్టార్డమ్ పెరిగాక హీరోయిన్ల రెమ్యూనరేషన్తోపాటే వాళ్లు చేసే ఖర్చు కూడా పెరుగుతుంది అంటుంటారు. ఇది చాలామంది హీరోయిన్ల విషయంలో గతంలోనూ చూశాం. అయితే మరీ పది, పన్నెండు మంది అసిస్టెంట్లు ఉంటారా, ఉంటే అందరూ సెట్స్‌కి వచ్చి నిర్మాతలకు ఖర్చు పెంచుతారా అనే ప్రశ్న కూడా వస్తోంది. మరి దీనిపై పూజ ఏమంటుందో చూడాలి.