Nassar: చిరంజీవి పిలిచినా.. ఆత్మాభిమానం అడ్డు వచ్చి వెళ్లని నాజర్.. ఎందుకంటే?
July 2, 2024 / 05:35 PM IST
|Follow Us
నాజర్ (Nassar) అంటే మన కళ్ల ముందు ఓ విలక్షణ నట విశ్వరూపం కనిపిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించి, మెప్పించడం ఆయనకు అలవాటు. అలా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ఆ తరం నటుల్లాగే ఆయన కూడా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సినిమా కష్టాలను ఫేస్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. దీంతో నాజర్ ఎర్లీ డేస్ అంత కష్టంగా గడిచాయా అని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత నాజర్‌కు కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్‌గా పనిచేశారట. అప్పుడే విషయం తెలుసుకున్న చిరంజీవి (Chiranjeevi) సినిమాల్లో అవకాశాలు ఇస్తానని పిలిచారట. అయితే ఆత్మాభిమానం అడ్డొచ్చి నాజర్ వెళ్లలేదట. ఎందుకు అని అడిగితే.. బ్యాచ్‌లో తనకు వెంటనే అవకాశాలు దొరకలేదట. ఏవో చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. ఆ సమయంలో షూటింగ్‌కు వెళ్లాలంటే ఇంటి నుండి ఉదయం ఆరుకే స్టార్ట్ అవ్వాలి. అప్పట్లో ఆర్టిస్టులందరూ భోజనం బాక్స్‌లు కట్టుకుని షూటింగ్ స్పాట్‌కి వచ్చేవారట. ఒక్కోసారి ఇంట్లో కూర వండకపోతే.. ఉత్త అన్నమే తెచ్చుకునేవారట.
ఆ సమయంలో చిరంజీవి, ఇతర నటులకు ఆంధ్రా మెస్ నుండి భోజనాలు వచ్చేవట. దీంతో వారేమైనా సాంబారు, కూరలు ఇస్తారేమోనని ఎదురు చూసేవాడిరట నాజర్. అలా ఓ రోజు వంట కోసం ఉదయాన్నే అమ్మను ఇబ్బంది పెట్టొద్దు. మేం ఏడుగురం తింటున్నాం కదా నువ్వు కూడా మాతో తిను అని అన్నారట. ఆ తర్వాత నుండి షూటింగ్ అయ్యే వరకూ చిరంజీవితో కలసి భోజనం చేశారట. అయితే ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో తాజ్ కోరమండల్ హోటల్లో వెయిటర్ పనిలోకి చేరారట నాజర్.
అలా ఓ రోజు హోటల్‌కి దగ్గరలోనే సినిమా షూటింగ్ అవుతోంది అని తెలిసి నాజర్ వెళ్లారట. చూస్తే షూటింగ్లో చిరంజీవి. తను షూటింగ్ స్పాట్‌కు వచ్చిన విషయం తెలసుకున్న చిరంజీవి.. పిలిపించారట. ‘ఏం చేస్తున్నావ్’ అని అడిగితే. ‘వెయిటర్‌గా పనిచేస్తున్నా’ అని చెప్పారట,. నువ్వు ఇలా చేయడమేంటి? రేపు ఉదయం వచ్చి కలువు అని అన్నారట చిరంజీవి. అయితే ఆత్మాభిమానం అడ్డువచ్చి వెళ్లలేదట. అక్కడికి కొద్ది రోజులకు బాలచందర్ (Balachander) చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అవకాశాలు దక్కించుకున్నానని చెప్పారు నాజర్.