ఈ మధ్యనే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ నటించిన ‘చోర్ బజార్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ నటి అర్చన. ఇప్పటి ప్రేక్షకులకి ఈమె తెలిసుండకపోవచ్చు. కానీ 1990లో ఈమె కూడా తన నటనతో ఓ ఊపు ఊపిన నటే.విజయవాడకి చెందిన ఈ నటి 1981 వ సంవత్సరంలో వచ్చిన ‘మధుర గీతం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈమె అసలు పేరు సుధ అయినప్పటికీ అర్చన గానే ఎక్కువ ఫేమస్ అయ్యింది.
1982 వ సంవత్సరంలో వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రంతో ఈమె మంచి నటిగా ప్రశంసలు అందుకుంది. బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ఓ క్లాసిక్ అనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత అర్చన ‘లేడీస్ టైలర్’ ‘దాసి’ ‘మట్టి మనుషులు’ ‘భారత్ బంద్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994వ సంవత్సరంలో వచ్చిన ‘పచ్చతోరణం’ చిత్రం తర్వాత ఈమె మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత అర్చన ‘చోర్ బజార్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈమె సినిమాల్లో నటించి చాలా కాలం అయిపోయింది కదా.. ఈమె కోసం జనాలు సినిమాకి వెళ్తారా? అని అంతా అనుకున్నారు. కానీ ఈమె నటిస్తోంది అంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉండే ఉంటుంది అని ఆశించిన వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే పాత్ర మాత్రం చాలా నిరాశపరిచింది అనే చెప్పాలి. ఈమె చాలా బాగా నటించింది కానీ పాత్రలో బలం లేదు.
ముఖ్యంగా ఈమె టీనేజ్ లో ఉన్నప్పుడు అమితాబ్ ఫ్యాన్ గా రెండు జడలు వేసుకుని కనిపించిన సీన్స్ ని చూసినప్పుడు అంతా చాలా డిజప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. ఇలాంటి బలం లేని పాత్రని ఆమె ఎలా ఎంపిక చేసుకుంది అనే డౌట్ అందరికీ వస్తుంది. దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన గత చిత్రాలకు ఇంప్రెస్ అయిపోయి… ఈమె ఓకే చెప్పేసి ఉండొచ్చేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!