ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ తరచుగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్ననే మలయాళ నటుడు ఎన్ డి ప్రసాద్ మరణవార్త ఇండస్ట్రీని కుదిపేసింది. అతడు చెట్టుకి ఉరేసుకొని చనిపోవడం చాలా మందిని బాధించింది. అది మరవకముందే ఇప్పడు మరో మరణవార్త ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. ప్రముఖ మలయాళ నటి అంబికా రావు(58) గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. చాలా రోజులుగా ఆమె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
మధ్యలో కరోనా వచ్చింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఎర్నాకుళంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అంబిక మృతి చెందినట్టు సమాచారం. ఆమె మృతి పటేల్ మలయాళ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ‘కృష్ణ గోపాలకృష్ణ’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు అంబికారావు.
ఆ సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేశారు. ఆ తరువాత ‘తొమ్మనుమ్ మక్కలుమ్’, ‘సాల్ట్ అండ్ పెప్పర్’, ‘రాజమాణికం’, ‘వెల్లినక్షత్రం’ సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేశారు. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ‘కుంబళంగి నైట్స్’ అనే సినిమా నటిగా ఆమెకి మంచి గుర్తింపు తీసుకచ్చింది. ఈ సినిమానే విశ్వక్ సేన్ తెలుగులో ‘ఫలక్ నుమా దాస్’ పేరుతో రీమేక్ చేశారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!