సీనియర్ హీరోయిన్ యమున షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • June 9, 2020 / 09:00 AM IST

అప్పట్లో పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది యమన. ‘మౌనపోరాటం’ అనే చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘మామగారు’ ‘ఘటన’ వంటి హిట్ సినిమాల్లో కూడా ఈమె నటించింది. ఇటీవల కాలంలో ఈమె విజయ్ దేవరకొండ ‘టాక్సీ వాలా’ సినిమాలో నటించింది. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించి మంచి మార్కులు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ‘మౌనపోరాటం’ సినిమా టైములో ఆమె ఫేస్ చేసిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

ఆ చిత్రంలో ఈమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది. అంతేకాదు అంతకు మించిన సీన్లలో కూడా నటించి అప్పటి కుర్ర కారుని హీటెక్కించింది. అయితే ఆ చిత్రం ఆడటానికి కారణం కూడా ఈమె గ్లామరే.. అంటుంది యమున. ‘ఆరోజుల్లో ఎక్స్ పోజింగ్ చెయ్యడానికి.. ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళం. ‘మౌనపోరాటం’ చిత్రం డైరెక్టర్ మోహన్ గాంధీ గారు.. ‘నేను ఈ చిత్రంలో ఎక్స్ పోజింగ్ చెయ్యాలి’ అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు.

నేను చెయ్యాల్సిన పాత్ర అలాంటిది. అనవసరంగా గ్లామర్ షో చేసే పాత్ర కాదు ఇది.. కచ్చితంగా ఆ చిత్రానికి అవసరం. దాంతో ఇక తప్పలేదు. నేను కనుక ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోకపోయి ఉంటే.. సినిమా బాగా ఆడేది కాదు. తరువాత ఎన్నో చిత్రాల్లో నేను అనవసరంగా ఎక్స్ పోజింగ్ చేసానేమో.. అని అనిపించేది.. కానీ ‘మౌన పోరాటం’ చిత్రం విషయంలో అలాంటి ఫీలింగ్ లేదు” అంటూ యమున చెప్పుకొచ్చింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus