తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తమిళనాడులో ఉన్నప్పుడు తమిళ సినిమాలకు ధీటుగా.. తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకునేవి. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ కు మారిన తర్వాత చాలా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణంరాజు వంటి వారు రాజ్యమేలిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.నిర్మాత రామానాయుడు, దర్శకుడు దాసరి నారాయణరావు వంటి వారు తెలుగు చలన చిత్ర రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. అప్పటి రోజుల్లో కోట్లకు కోట్ల బడ్జెట్ పెట్టాల్సిన పని లేదు.
ఎన్టీఆర్ వంటి నెంబర్ 1 హీరో సినిమాకు రూ.5 లక్షల బడ్జెట్ పెడితే ఎక్కువ అనుకునే వారు. ఆ బడ్జెట్ కు ఇప్పటి రోజుల్లో అయితే ఓ స్టార్ కమెడియన్ కూడా యాక్ట్ చేయడం కష్టం అనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్ల పారితోషికాలు అయితే వెయ్యి నూట పదహార్లు అన్నట్టు ఉండేవి. అయితే ఆ టైంలో స్టార్ హీరోల పారితోషికాలు ఎలా ఉండేవి అనే ప్రశ్న అందరిలోనూ ఉండే ఉంటుంది. మొదట్లో ఎన్టీఆర్ ఒక్కరే రూ. లక్ష రూపాయల పారితోషికం అందుకున్నారు.
ఏఎన్నార్ కూడా అదే విధంగా తీసుకున్నారు. ఇక కొంతకాలానికి వీరి కృష్ణ, శోభన్ బాబుల డామినేషన్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయడం.. అందులో చాలా వరకు విజయం సాధించడంతో దర్శకనిర్మాతలు అటు వైపు మళ్లారు. శోభన్ బాబు ఓ దశలో రూ.5 లక్షల పారితోషికం అందుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు. అప్పటివరకు దర్శకనిర్మాతలకు అందుబాటులో ఉన్న అన్నగారు సైతం సినిమా సినిమాకి పారితోషికం పెంచుకుంటూపోయారు. వీళ్ళు పీక్స్ లో ఉన్న రోజుల్లో రూ.50 లక్షల పారితోషికం వరకు వెళ్లారు.
వీళ్ళలో కృష్ణంరాజు కి మాత్రమే పారితోషికం తక్కువ కావడం గమనార్హం. సుమన్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోల ఎంట్రీ ఇచ్చేవరకు.. 80ల స్టార్ హీరోల హవా నడిచింది. చివరికి సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే ‘మేజర్ చంద్రకాంత్’ తో కోటి రూపాయల పారితోషికం మార్క్ ను టచ్ చేశారు. ఆ రికార్డ్ ని చిరంజీవి వెంటనే బ్రేక్ చేశారు అనుకోండి.అయితే ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రానికి గాను కృష్ణ కూడా కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!