NTR,Rajinikanth: ఎన్టీఆర్ మాట విని రజనీకాంత్ మామూలు మనిషి అయ్యారా?
May 30, 2022 / 06:14 PM IST
|Follow Us
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ మారుమూల పల్లెటూరులో సాధారణ రైతుబిడ్డగా జన్మించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అంతాఇంతా కాదు. సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో యువకుని నుంచి వృద్ధుడి వరకు ఎన్నో పాత్రలను పోషించి మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా వేర్వేరు పాత్రలలో నటించి ఆయన మెప్పించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ నటనకు వీరాభిమాని కావడం గమనార్హం. శ్రీ కృష్ణ పాండవీయం సినిమాను చూసి రజనీకాంత్ పౌరాణిక నాటకంలో దుర్యోధనుడి వేషంలో నటించగా ఆ నాటకం సక్సెస్ కావడంతో పాటు సినిమాలలో ప్రయత్నించాలని ఆయనకు చాలామంది సలహాలు ఇచ్చారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రజనీకాంత్ ట్రైనింగ్ తీసుకున్నారు. కె.బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా రజనీకాంత్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరిగింది.
సీనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ కాంబినేషన్ లో టైగర్ అనే సినిమా తెరకెక్కింది. అయితే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్ మరోవైపు తనకు ఉన్న చెడు అలవాట్ల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన అలవాట్ల వల్ల రజినీకాంత్ మానసిక ఒత్తిడికి గురయ్యేవారు. ఆ మానసిక ఒత్తిడి వల్ల రజినీకాంత్ అన్ బ్యాలన్స్ కావడంతో పాటు ఇతరులపై సీరియస్ అయ్యేవారని సమాచారం. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్ కు బ్రహ్మ కాలంలో ప్రాణాయామం చేయాలని సూచనలు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన సూచనల వల్ల రజనీకాంత్ మామూలు మనిషి అయ్యారు. మేజర్ చంద్రకాంత్ ఆడియో ఫంక్షన్ సమయంలో రజనీకాంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా గుర్తు పెట్టుకునేవారు. సెట్ లోకి వచ్చిన వెంటనే నిర్మాతకు, డైరెక్టర్ కు నమస్కరించి రామారావు తన పనుల్లో బిజీ అయ్యేవారు. మన దేశం సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం కేవలం 200 రూపాయలు కావడం గమనార్హం.