ప్రముఖ నిర్మాత చదలవాడ చేతుల మీదుగా “డాన్స్ రాజా డాన్స్” సాంగ్ రిలీజ్!

  • February 16, 2021 / 03:45 PM IST

ప్రముఖ నటుడు-దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, భాగ్యరాజ, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య తారాగణంగా… వెంకీ దర్శకత్వంలో రూపొంది డాన్సులతో ఉర్రూతలూగించిన ఓ చిత్రం “డాన్స్ రాజా డాన్స్”గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ చిత్రంలో.. “కొట్టుకొట్టు కన్నే కొట్టు… కన్నెపిల్ల పడేట్టు.. ఖరీదైన బిస్కట్టు… కౌగిలిలో ఇచ్చేట్టు” అనే పల్లవితో సాగే హుషారైన మాస్ మసాలా గీతాన్ని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పాటలు ప్రత్యేక ఆకర్షణగా రూపొందిన “డాన్స్ రాజా డాన్స్” తెలుగులోనూ ఘన విజయం సాధించాలని చదలవాడ అభిలషించారు. భారతీబాబు పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ… రాజు-సుధీర్-మూర్తిలతో కలిసి ప్రముఖ సంగీత దర్శకురాలు-గాయని ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. చిత్ర పరిశ్రమ చిరకాలం పచ్చగా ఉందాలని కోరుకునే మనసున్న వ్యక్తి, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా ‘డాన్స్ రాజా డాన్స్’ పాట రిలీజ్ కావడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ‘సంధ్య’ రవి, ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు!!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus