Rashmi: యాంకర్ రష్మీపై సీనియర్ ప్రొడ్యూసర్ కామెంట్స్!

  • March 14, 2022 / 05:58 PM IST

‘జబర్దస్త్’ షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఓ సినిమా విషయంలో మాత్రం రష్మీ తమను బాగా ఇబ్బంది పెట్టిందంటూ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం వెల్లడించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రష్మీ.. తమను బెదిరించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. రష్మీని తిట్టిన మాట నిజమేనని కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ”సాధారణంగా నేను ఎదుటివ్యక్తిని తిట్టను. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాను.

Click Here To Watch Now

కానీ రష్మీని ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే.. మాతో ‘రాణి గారి బంగ్లా’ అనే సినిమా చేయడానికి ఒప్పుకుందామె. ముందు మేము చెప్పిన రెమ్యునరేషన్ కి ఆమె ఓకే చెప్పింది. అప్పుడు ఆమె ‘గుంటూరు టాకీస్’ సినిమా చేసింది. మా సినిమాతో పోలిస్తే అది డిఫరెంట్ ఫిల్మ్. అంతా ఓకే అనుకున్న తరువాత షూటింగ్ మొదలుపెట్టాం. ఒక సాంగ్, డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు రష్మీ గొడవ పెట్టింది. హీరోని మార్చేయాలని చెప్పింది.

ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే.. నాకు నాగబాబు గారు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలుసు. టీవీ9 ఎక్కిస్తా.. అది చేస్తా, ఇది చేస్తా అంటూ బెదిరించింది. నేను ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంటున్నాను. నాకు నాగబాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్లు తెలుసు. రష్మీ నాతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ సమయంలో నేను తనను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని అన్నాను. నేను నిజాయితీగా ఉండమని ఆమెని బెదిరించాను.

నా వయసెంత, ఆమె వయసెంత. ఒప్పుకున్న రెమ్యునరేషన్ తీసుకొని చివరకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఫైనల్ గా ఆమే వచ్చి షూటింగ్ పూర్తి చేసింది. నేను చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ లను చూశాను. వారు టైమింగ్ అంటే టైమింగ్ అన్నట్లు ఉంటారు” అంటూ రష్మీ గురించి చెప్పుకొచ్చారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus