షాక్ ఇస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్ షాకింగ్ అండ్ బోల్డ్ కామెంట్స్!
February 1, 2024 / 05:32 PM IST
|Follow Us
ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఓ వ్యక్తిని వల్లో పడేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ అది వర్కౌట్ కాలేదు.. చివరకు అతనితో రొమాన్స్ చేయడంలో విఫలమయ్యాను అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఎవరు ఆ సీనియర్ స్టార్ హీరోయిన్? ఎవరు ఆ వ్యక్తి? వివరాల్లోకి వెళితే… ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ కి చెందిన మాధురీ దీక్షిత్.
ఈమె గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో, బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొని.. తన భర్త శ్రీరామ్ మాధవ్ నేనే గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ” ఓ రోజు మేం ఇద్దరం ఇంట్లో ఏకాంతంగా ఉన్నాం. ఈ క్రమంలో నేను ఓ రొమాంటిక్ ప్లాన్ వేశాను.
అలాంటిది మీరు సీరియల్స్, హిందీ సినిమాల్లో చూసి ఉండవచ్చు.ఏంటంటే.. హీరోయిన్ కాళ్లకు పట్టీలు కట్టుకుని తిరుగుతుంది. అప్పుడు అందమైన గజ్జల శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న హీరో ఉత్సాహంగా కనిపిస్తాడు. అప్పుడు హీరోయిన్ సిగ్గుపడుతుంది. ఇదే ట్రిక్ ను నేను కూడా ప్లే చేశాను. కానీ భర్త ఏదో పనిలో ఉండి.. పట్టించుకోలేదు. కాబట్టి నేను కానీ, నా భర్త కానీ అంత రొమాంటిక్ కాదు” అన్నట్టు మాధురి దీక్షిత్ చెప్పుకొచ్చింది.