సర్ధార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ సంపత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
March 23, 2017 / 01:57 PM IST
|Follow Us
సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరైన సంపత్ కుమార్ ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణ జిల్లా రైట్స్ కొని రెండు కోట్లు అప్పులు పాలయినట్లు గతంలో మీడియా ముందు వాపోయారు. కాటమరాయుడు చిత్రం ఒక ఏరియా హక్కులు తనకి ఇస్తే నష్టాల నుంచి బయట పడతానని వేడుకున్నారు. మొదట్లో ఇస్తానని చెప్పి ఇప్పుడు నిర్మాత శరత్ మరార్, మేనేజర్ శ్రీనివాస్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలనీ వారం రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ వద్ద సంపత్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని పోలీసులు బుధవారం రాత్రి అడ్డుకున్నారు.
సంపత్ దీక్షను భగ్నం చేశారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి గురువారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుండడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. “ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయెచ్చు.. కానీ నాకు న్యాయం జరిగేవరకు దీక్ష చేస్తాను” అని హెచ్చరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.