పెద్దమ్మ ఆశీర్వాదాలతో శాకుంతలం ప్రమోషన్స్ మొదలు!

  • March 15, 2023 / 06:58 PM IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.అయితే ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీని సమంత చూశారు. ఈ క్రమంలోనే తన అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేముందు చిత్ర బృందం మొత్తం జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఇలా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా సమంతతో పాటు ఈ సినిమాలో సమంతకు జోడిగా నటించిన నటుడు దేవ్ మోహన్, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలిమ గుణ, ఇతర చిత్ర బృందం కూడా పాల్గొనీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసే అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా ఒక విజువల్ వండర్ లా, త్రీడీ టెక్నాలజీతో రూపొందించారు. ఈ సినిమా తెలుగు హిందీ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా సమంత కెరియర్ లోనే ఒక అద్భుతమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags