రామ్ చరణ్, బోయపాటి సినిమాకి అంతా క్లియర్!

  • February 1, 2018 / 06:32 AM IST

మెగా అభిమానులు రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. అదే విధంగా బోయపాటి తో సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే బోయపాటి శ్రీను మాస్ అభిమానులకు తన సినిమాతో విందు భోజనం పెడుతారు. అలాంటి డైరక్టర్ తో చెర్రీ సినిమా చేస్తే చూడాలని వారు కోరుకుంటున్నారు. ఈ సినిమాకి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి మొదటి వారం  నుంచే సెట్స్ పైకి వెళ్ళడానికి చిత్ర బృందం రెడీ చేసింది. అయితే రంగస్థలంలో కొన్ని సీన్లు రీషూట్ చేయాలనీ సుకుమార్ కోరడంతో చరణ్ అందుకు సహకరిస్తున్నారు.

ఫిబ్రవరి 15 వరకు రంగస్థలం కోసం పనిచేయనున్నారు. ఆ తర్వాత బోయపాటికి డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నలుగురు వదినల ముద్దుల మరిదిగా రామ్ చరణ్ కనిపించనున్నారు.  రామ్ చరణ్ కి వదినలుగా స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజ, ప్రవీణలు నటించనున్నారని సమాచారం. ఇందులో హీరోయిన్, విలన్ పాత్రలను బాలీవుడ్ నటీనటులు పోషిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా చెర్రీతో స్టెప్పులు వేయనుండగా, వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా తలపడనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus