Shah Rukh Khan, Atlee: షారుఖ్ – అట్లీ సినిమా పేరు ఇదే!
June 2, 2022 / 08:18 PM IST
|Follow Us
షారుఖ్ ఖాన్‌తో అట్లీ సినిమా.. చాలా కాలం పుకారుగా మాత్రమే వినిపించిన ఈ ప్రాజెక్టు ఇటీవల పట్టాలెక్కేసింది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా టీజర్ విడుదలయ్యే స్టేజీకి వచ్చేసింది. ఏంటి నమ్మలేకపోతున్నారా? ఇలాంటి ప్రశ్నకు అస్సలు తావు లేదు. ఎందుకంటే ఈ మాట నమ్మాల్సిందే. అంతేకాదు ఈ టీజర్ వీడియోతోపాటు సినిమా టైటిల్ కూడా రివీల్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే టాలీవుడ్‌లోని డిజాస్టర్లలో ఒకటైన ఓ సినిమా పేరు ఈ సినిమాకు టైటిల్ అవ్వబోతోంది.
అట్లీ సినిమా అంటేనే తెలుగు సినిమాలను, తమిళ ఫ్లేవర్‌లో కలిపి మిక్సీ కొట్టినట్లు ఉంటుంది. ఇప్పటివరకు అట్లీ చేసిన సినిమాలన్నీ దాదాపు ఇదే కాన్సెప్ట్‌లో ఉంటాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్‌తో కూడా అదే కాన్సెప్ట్‌లోనే సినిమా చేస్తున్నారట. అందులో భాగంగా ‘జవాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఓ జవానుగా కనిపిస్తారని టైటిల్ బట్టి తెలుస్తుంది. మరి బాద్షాని ఎలా చూపిస్తారు అనేది చూడాలి.
అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ప్రతిష్ఠాత్మక చారిత్రక నేపథ్యమున్న చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’. ఈ సినిమా ఈ నెల 3న విడుదల కాబోతోంది. ఆ సినిమాతోనే ‘జవాన్’ సినిమా టైటిల్ వీడియోను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సెన్సార్ పూర్తయింది అన్నట్లుగా కొన్ని స్క్రీన్షాట్లు తమిళ సినీ గోయర్స్, నెటిజన్ల సోషల్ మీడియాలో ఖాతాలో కనిపిస్తున్నాయి. వాటి ప్రకారంమే షారుఖ్ – అట్లీల సినిమా పేరు ‘జవాన్’ అని అనుకుంటున్నారు.
ఈ సినిమాలో నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో షారుఖ్ డబుల్ రోల్ చేస్తున్నట్లు లీకైంది. అయితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. టీజర్ వీడియోలో ఏమన్నా చెబుతారేమో చూడాలి. ఈ ఏడాది విడుదలైతే సరి. అలాకాకుండా 2023లో వస్తే.. ఆ ఏడాది షారుఖ్ నుండి మూడు సినిమాలు వస్తాయి. విడుదల కానుందో తెలియరాలేదు. ఒకవేళ 2023కు వెళ్తే… వచ్చే సంవత్సరం షారుక్ ఖాన్ మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ‘పఠాన్’, ‘డుంకీ’ వచ్చే ఏడాదికి షెడ్యూల్ చేసిన విషయం విదితమే.