Samantha: స్టార్ హీరోయిన్ పై బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్
September 28, 2021 / 06:44 PM IST
|Follow Us
కెరీర్ టాప్ స్పీడ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకుంది సమంత. ఆ తర్వాత సినిమాల్లో జోరు తగ్గుతుందేమో అని అనుకుంటే… ఇంకాస్త పెంచింది. అప్పటికే దక్షిణాదిని ఓ చుట్టు చుట్టేసిన సమంత… ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ ’ సిరీస్‌తో హిందీ సీమను టచ్ చేసింది. ఆమె నటనను చూసి అందరూ మురిసిపోయారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఆమె నటనకు ఫిదా అయిన హీరోలూ ఉన్నారు. అందులో ఒకరు తాజాగా స్పందించారు.
బాలీవుడ్లో విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న హీరో షాహిద్ కపూర్. తొలినాళ్లలో లవర్ బాయ్‌గా రాణించినా… ఆ తర్వాత సినిమాల్లో తనదైన వైవిధ్యం చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. రకరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. అలాంటి షాహిద్‌కు సమంతతో నటించాలనే ఆలోచన కలిగిందట. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత నటన చూసి బాగా ముచ్చటపడ్డాడట షాహిద్. అందుకే ఆమెతో నటించాలని అనుకుంటున్నాడట. సమంత కెరీర్లో చాలా సినిమాలు చేసినా బాలీవుడ్‌వైపు కన్నెత్తి చూడలేదు.
అంత టైమ్ కూడా ఆమెకు లేదు. అయితే ఇప్పుడు సామ్ కథల విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంటోంది. ఏదో ఒక పాత్ర చేసేయడం లేదు. అలా బాలీవుడ్లో మంచి పాత్ర ఏదైనా దొరికితే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆమెకు తగ్గ పాత్ర షాహిద్ సెట్ చేస్తే… కచ్చితంగా తన కోరిక నెరవేరుతుంది.