సాధారణ జనాలే చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏదో బాడీలో ఒక పార్ట్ మిస్ అయినట్లు ఫీలైపోతున్నారు. ముఖ్యంగా కనీసం గంటకోసారి ఫేస్ బుక్, వాట్సాప్ చూసుకోకపోతే రోజు గడవట్లేదు. అలాంటిది సూపర్ స్టార్ అజిత్ కి వైఫ్ అయిన షాలిని మాత్రం ఓ బేసిక్ ముబైల్ ను వాడుతూ.. భర్త అడుగుజాడల్లోనే నడుస్తుంది. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే అజిత్ కూడా స్మార్ట్ ఫోన్ వాడదు. అతడి బాటలోనే షాలిని కూడా పయనిస్తూ ఒక బేసిక్ ఫోన్ వాడుతోంది. ఈ విషయం ఇటీవల ఆమె తాజా ఫోటోల ద్వారా తెలిసింది. నోకియా బేసిక్ ఫోన్ ను ఆపరేట్ చేస్తున్న షాలినిని చూసి జనాలు షాక్ అయ్యారు.
అయినా.. ఒక విధంగా చెప్పాలంటే అనవసరమైన నోటిఫికేషన్స్ గట్రా లేకుండా హ్యాపీగా ఫోన్స్ & అవసరమైన మెసేజస్ మాత్రమే వచ్చే బేసిక్ ఫోన్స్ చాలా బెటర్ అబ్బా. లేదంటే.. చేతిలో ఫోన్ ఉంది కదా అని దాన్ని చూసుకుంటూ కూర్చుంటూ జనాలతో మాట్లాడడం మానేశారు కొందరు. అందరు అజిత్ & షాలిని తరహాలో బేసిక్ ఫోన్స్ వాడితే ఎంత బాగుండో కదా.. కానీ కష్టమే.