బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ.!

  • December 11, 2019 / 06:58 PM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది హీరోయిన్ షాలినీ పాండే. ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఈమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది జరగలేదు. ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈమెకు కలిసొచ్చిందేమి లేదు. ఇక ‘118’ చిత్రం హిట్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం నివేదా థామస్ కొట్టేసింది. 100% తమిళ రీమేక్ లో ఈమె నటిస్తుంది తప్ప.. ప్రస్తుతానికి ఈమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశం. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రంలో షాలినీ పాండే కీలక పాత్ర చేసే అవకాశం కొట్టేసింది అనేది తాజా సమాచారం. ఈ చిత్రం హిట్ అయ్యి ఈమె పాత్రకు మంచి పేరు వస్తే.. అక్కడ ఈమెకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంటుందని ఫిలిం విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఇలా అయినా ఆమెకు కాలం కలిసొస్తుందేమో చూడాలి..!

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus