కొందరు నిండుగా చీర కట్టుకున్నా అందంగా కనిపిస్తారు. ఇంకొందరు టూ పీస్ బికినీ వేసుకున్నా కూడా అందంగా కాదు కదా కనీసం ఆకర్షణీయంగా కనిపించరు. “అర్జున్ రెడ్డి” భామ షాలినిపాండే కూడా ఈ ఫార్మాట్ ను ఫాలో అవుతుంది. అందుకే.. గ్లామరస్ గా కనిపించడం అంటే చిట్టిపొట్టి బట్టల్లో ఒళ్ళంతా కనిపించేలా స్కిన్ షో చేయడం కాదు, అందంగా కనిపించడం అంటూ గ్లామర్ పాఠాలు చెబుతోంది షాలినిపాండే.
“అర్జున్ రెడ్డి” సినిమా తర్వాత తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన షాలినిపాండే ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడిది గ్లామరస్ రోల్ అట. సో, గ్లామర్ రోల్ కాబట్టి భీభత్సమైన ఎక్స్ పోజింగ్ ఉంటుందా అని అడిగినవారికి పై విధంగా సమాధానం చెప్పింది షాలినిపాండే అలియాస్ ప్రీతి రెడ్డి. అమ్మడి మైండ్ సెట్ చూస్తుంటే.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన్ పాత్ క్రియేట్ చేసుకొనేలా ఉంది.