సినిమా చివర్లో 20 కోట్లు అనవసరంగా వృధా చేసిన శంకర్
November 30, 2018 / 11:52 AM IST
|Follow Us
డైరెక్టర్ శంకర్ – రజని కాంబినేషన్లో వచ్చిన ‘2.o’ నిన్న విడుదలై మంచి వసూళ్లు సాధిస్తూ సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. ‘రోబో’ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు ప్రస్తుతం మరొక పెద్ద సినిమా అనేది పోటీ లేకుండా ఉండటం వలన బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లు రాబట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ సినిమా కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చుపెడతానే టాక్ ఉంది. ఈ సినిమాలో కూడా శంకర్ అనవసరంగా చివర్లో 20 కోట్లు ఎందుకు వృధా చేశాడంటూ కొందరు విమర్శించడం మొదలుపెట్టారు.
ఇక విషయంలోకి వెళితే, సంగీత దర్శకుడు ఏఆర్.రహమాన్ ‘యంతరలోకపు సుందరివే’ అనే అద్భుతమైన ట్యూన్ ఇవ్వగా ఈ పాట కోసం శంకర్ నాలుగు సెట్లు వేయించి దాదాపుగా ఈ ఒక్కపాటకోసమే 20 కోట్లు ఖర్చు పెట్టి పది రోజులు ఈ పాట కోసం షూట్ చేసి, మంచి గ్రాఫిక్స్ తో ఈ పాటని చిత్రీకరించగా, ఈ పాటని సినిమా చివర్లో వచ్చే రోలింగ్స్ టైటిల్స్ దగ్గర పెట్టడంతో, ఇంత కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఈ పాటను డైరెక్టర్ శంకర్ ఎందుకు ఆలా రోలింగ్ టైటిల్స్ దగ్గర పెట్టాడు, అసలు ఈ పాటని ఎందుకు తీసాడో అంటూ కొందరు విమర్శించడం మొదలుపెట్టారు. మరి డైరెక్టర్ అలా తీసాడంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందని కొందరు భావిస్తున్నారు.