Bigg Boss 5 Telugu: సిరిపై షణ్ముక్ ఫైర్ ఎందుకు అయ్యాడు ? ఇద్దరికీ చెడిందా.?
November 4, 2021 / 05:26 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో సూపర్ హీరోస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ ప్రారంభం అవ్వక ముందు సిరి నిద్రపోతుంటే కుక్కలు మొరిగాయి దీనికి షణ్ముక్ కెప్టెన్ గా రియాక్ట్ అయ్యాడు. ఒక కప్పుని స్మిమ్మింగ్ పూల్ దగ్గరకి తీస్కుని వచ్చి స్పూన్ తో దాన్ని నింపుతూ సారీ ఇంకెప్పుడూ పడుకోను అంటూ చెప్పమని చెప్పాడు. దీనికి సిరి చాలా సీరియస్ అయ్యింది. స్పూన్ తో టకటకా నింపేసే ప్రయత్నం చేస్తుంటే షణ్ముక్ కప్పులోని నీళ్లని ఒంపేసి మరోసారి చేయమని చెప్పాడు. చాలా బాధపడుతూనే సిరి ఈ పని చేసింది.
సారీ బిగ్ బాస్ ఇంకెప్పుడూ పడుకోను అంటూ స్పూన్ తో నీళ్లు తీస్తూ కప్పుని నింపింది. ఆ తర్వాత కూడా షణ్ముక్ పనిష్మెంట్ సరిగ్గా చేయలేదని స్పూన్ పెట్టి కప్పులోని నీళ్లని తిరిగి పూల్ లో పోయమని చెప్పాడు. సిరి ఈ పనిష్మెంట్ ని చాలా ఈజీగా తీస్కుంటూ కామెడీ చేసే ప్రయత్నం చేసింది. ఇదంతా ఒకవైపు చూస్తున్న కాజల్ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. కాజల్ కూడా నేను ఇదే పనిష్మెంట్ ఇచ్చానని చెప్పాడు షణ్ముక్. ఇక్కడ కెప్టెన్ మాట్లాడుతున్నాడు అని, షణ్ముక్ కాదని సిరికి అర్ధమయ్యేలా క్లాస్ పీకాడు. అయినా కూడా సిరి షణ్ముక్ చేసిన పనిని పర్సనల్ గా తీస్కుంది. నేను కెప్టెన్ అయితే అప్పుడు నీతో బాత్రూమ్ లో బక్కెట్ ని చేతులతో నింపిస్తానంటూ అక్కడ్నుంచీ రుసరుసలాడుతూ వెళ్లిపోయింది.
ఇక టాస్క్ లో కూడా ఇద్దరికీ గట్టిగానే పడింది. నువ్వు చేసిన పని చెప్పు ముందు.. వేరేవాళ్లు చేసింది కాదు అంటూ షణ్ముక్ సిరిని మందలించాడు. దీనికి గట్టిగా రియాక్ట్ అయ్యింది సిరి. ఇక ప్రోమోలో చూపించినట్లుగా నీ మాటలు నా మనసుకి బాగా హర్టింగ్ అనిపిస్తాయి అంటూ మాట్లాడింది సిరి. వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎలా టర్న్ తీస్కోబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.