Bigg Boss 5 Telugu: తన లైఫ్ టర్నింగ్ పాయింట్ చెప్పిన షణ్ముక్..!
October 23, 2021 / 05:28 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం కోల్గెట్ స్మైల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ తమ జీవితంలో జరిగిన సంఘటనలని చెప్పుకున్నారు. ఇక్కడే షణ్ముక్ తను సూసైడ్ చేస్కోబోయానని బెంగుళూర్ లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత బెంగుళూర్ లో సీట్ వచ్చింది, అదే టైమ్ లో లవ్ బ్రేకప్ అయ్యింది. నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను అని సూసైడ్ చేస్కోబోతుంటే., సరిగ్గా నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టాడు. అయినా కూడా నేను డోర్ తీయలేదు. తర్వాత వాడు ఎలా గ్రహించాడో కానీ, లోపలకి తోసుకుని వచ్చి నాలుగు పీకాడు. అలా వాడు కొట్టబట్టే నేను ఇప్పుడు ఇక్కడున్నానని చెప్పాడు. వాడివల్లే నాకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. లేదంటే షణ్ముక్ జస్వంత్ అనేవాడు ఉండేవాడు కాదు అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత వైవా అనే షార్ట్ ఫిలింలో అవకాశం వచ్చింది. ఈ ఫిలిం ద్వారానే నాకు బ్రేక్ వచ్చింది. నా ఫేస్ లో స్మైల్ తెప్పించిన అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పాడు షణ్ముక్. ప్రస్తతం హౌస్ లో తనదైన స్టైల్లో గేమ్ ఆడుతున్న షణ్ముక్ ఓటింగ్ లో కూడా టాప్ లో దూసుకుపోతున్నాడు. గతవారం నామినేషన్స్ లో లేకపోయినా కూడా షణ్ముక్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అంతేకాదు, షణ్ముక్ ఈసీజన్ విన్నర్ అవుతాడని ముందుగానే ఫ్యాన్స్ జోస్యం చెప్పేస్తున్నారు.
మరోవైపు సన్నీ, శ్రీరామ్ చంద్ర, మానస్, రవిలు షణ్ముక్ కి గట్టిపోటీ ఇస్తున్నారు. మరో 7వారాలు ఉన్నాయి కాబట్టి వీరిలో ఎవరైనా షణ్ముక్ కి గట్టి పోటీ ఇస్తారేమో చూడాలి.