ప్రేమ వివాహానికి సిద్దమైన శర్వా, అమ్మాయి ఎవరంటే..?
August 26, 2020 / 03:34 PM IST
|Follow Us
కరోనా కష్టాల సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి ఆగడం లేదు. వరుసగా యంగ్ హీరోలు తమ బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశారు. హీరో నిఖిల్ మొదలుపెట్టగా ఆయనను నితిన్ మరియు రానా ఫాలో అవడం జరిగింది. ఇక మెగా డాటర్ నిహారిక కూడా పెళ్ళికి సిద్ధం అయ్యింది. ఇదే నెలలో జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకున్న ఆమె త్వరలో పెళ్లి చేసుకోనుంది. కాగా టాలీవుడ్ నుండి మరో హీరో పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హీరో శర్వానంద్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఐతే అమ్మాయి ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. గతంలో రామ్ చరణ్ భార్య ఉపాసన ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయితో శర్వానంద్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. శర్వా పెళ్లి చేసుకోనుంది కూడా ఆ అమ్మాయే అనే ప్రచారం కూడా సాగుతుంది. ఆయన పెళ్లి ప్రకటనతో దీనిపై పూర్తి క్లారిటీ రానుందని సమాచారం. మరి శర్వా కూడా పెళ్లిపీటలెక్కితే టాలీవుడ్ లో దాదాపు అందరు ముదురు బ్యాచ్ లర్స్ కి వివాహం జరిగినట్టే. ఇక శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అనే మూవీలో నటిస్తున్నారు.
అలాగే దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్న మహాసముద్రం మూవీ హీరో కూడా శర్వా అంటూ కథనాలు రావడం జరిగింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మరో హీరో కార్తికేయ నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై త్వరోనే అధికారిక ప్రకటన రానుంది.