శర్వానంద్ కొరకు 11 గంటలు శ్రమించిన డాక్టర్లు!

  • June 18, 2019 / 01:43 PM IST

క్రేజీ హీరో శర్వానంద్ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన విజయ్ సేతుపతి, త్రిష ల ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. తమిళ్ లో ’96’ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష పాత్రలో సమంత నటిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం బ్యాంకాక్ లో శర్వానంద్ ‘స్కైడైవింగ్’ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా గాయపడ్డాడు శర్వా. ఆ సమయంలో సరైన దిశలో ల్యాండ్ కాకపోవడంతో ఇలా ప్రమాదానికి గురయ్యాడు.

భుజానికి తీవ్ర గాయం కాగా, కాలికి కూడా గాయమైంది. దీంతో చిత్ర యూనిట్ శర్వా ను హైదరాబాద్ కు తరలించింది. శర్వానంద్ కు వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు. భుజానికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యుల బృందం దాదాపు 11 గంటల పాటు శ్రమించిందట. మొత్తంగా శర్వానంద్ కు విజయవంతగా చికిత్స పూర్తి చేశారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు కు రిలీజ్ చేద్దామని మొదట ప్లాన్ చేసినప్పటికీ.. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని శర్వానంద్ కు వైద్యులు చెప్పడంతో ఆలస్యమవ్వడం తప్పేలా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus