శర్వానంద్ ‘శ్రీకారం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • March 8, 2021 / 01:03 PM IST

శ‌ర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహ‌న్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న విడుదల శివరాత్రి కానుకగా విడుదల కాబోతుంది. ’14 రీల్స్ ప్ల‌స్‌’ బ్యాన‌ర్ ‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదల చేసిన ‘వస్తానంటివో’ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. టీజర్ , ట్రైలర్లు కూడా పర్వాలేదు అనిపించాయి.

దాంతో సినిమాకి మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం  5.70 cr
సీడెడ్  2.40 cr
ఉత్తరాంధ్ర  8.00 cr
ఏపీ+తెలంగాణ (టోటల్) 16.10 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్  01.00 cr
వరల్డ్ వైడ్ టోటల్  17.10 cr

‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే శర్వానంద్ గత చిత్రాలు ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఆ చిత్రాలు కనీసం రూ.10కోట్ల షేర్ ను నమోదు చేయలేకపోయాయి. దాంతో ‘శ్రీకారం’ రూ.17కోట్ల వరకూ షేర్ ను రాబడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తే.. అదేమీ పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus