Shilpa Shetty: భర్త అరెస్ట్ పై శిల్పాశెట్టి షాకింగ్ కామెంట్స్!

  • July 23, 2021 / 05:51 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పాశెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోపంగా ఉన్నప్పుడు వెనక్కి చూడకూడదని భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తు చూడకూడదని ఆమె పేర్కొన్నారు. మనల్ని భాధ పెట్టిన వారి వైపు కోపంగా చూస్తామని మనం ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతో భవిష్యత్తును చూస్తామని శిల్పాశెట్టి వెల్లడించారు.

సవాళ్లు తనకు కొత్త కాదని గతంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. భవిష్యత్తులో కూడా తాను సవాళ్లను ఎదుర్కొంటానని ఆమె చెప్పుకొచ్చారు. ఈరోజు తాను జీవించడాన్ని ఏ శక్తి ఆపలేదని ఆమె అన్నారు. నేను ఇంకా బ్రతికే ఉన్నానని అది తన అదృష్టమని నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నానని శిల్పాశెట్టి పేర్కొన్నారు. శిల్పాశెట్టి చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శిల్పాశెట్టి తన పోస్ట్ ద్వారా తన మానసిక పరిస్థితి గురించి అభిమానులకు తెలియజేశారు.

భర్త అరెస్ట్ వల్ల తన జీవితంలో ఏర్పడిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ శిల్పాశెట్టి షాకింగ్ కామెంట్లు చేశారు. శిల్పా శెట్టి ఈ కేసులో భర్తకు మద్దతు తెలపడం లేదని ఆమె పోస్ట్ ను బట్టి అర్థమవుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో శిల్పాశెట్టికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. పోలీసులు సైతం శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus