వరుసగా అవకాశాలు పట్టేస్తున్న శివాని!

  • July 14, 2018 / 10:49 AM IST

నీటిలోని చేప పిల్లకు ఈత నేర్పించాల్సిన అవసరం లేనట్టు…. నటీనటులుగా నిరూపించుకున్న వారి సంతానానికి నటన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారి రక్తంలోనే నటన ఉంటుంది. ఆ విషయం జీవిత రాజశేఖర్ తనయురాలు శివాని విషయంలో మరోసారి నిరూపితమైంది. హిందీ హిట్ ‘టూ స్టేట్స్’ రీమేక్‌గా రూపొందుతోన్న తెలుగు సినిమాతో శివానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్.. కనీసం ఫస్ట్ లుక్ కూడా రాకముందే శివానీ మరో రెండు సినిమాలకు సంతకం చేసింది.

కోలీవుడ్‌లో విష్ణు విశాల్ సరసన హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు తాజాగా మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ చిత్రంలో హీరోయిన్‌గా ఆమె  అవకాశం అందుకున్నట్టు ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పారు. ఆమె నటించిన చిత్రమేదీ విడుదల కాకుండానే..  కోకోకోలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడాన్ని విశేషంగా చెప్పుకుంటుండగానే.. మూడు చిత్ర పరిశ్రమల్లో ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక నటన బాగుంటే మాత్రం.. దక్షిణాది టాప్ హీరోయిన్స్ కి పోటీగా మారడం తథ్యం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus