Shivrajkumar: ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు!

  • April 27, 2022 / 06:07 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూ.. రెగ్యులర్ గా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్ టైటిల్ అయినప్పటికీ.. ఇదే సినిమాకి యాప్ట్ అని అంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Click Here To Watch NOW

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ తో కన్నడలో మరో సినిమా రూపొందుతోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ..

కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఒకే టైటిల్ తో ఒకే సమయంలో రెండు సినిమాలను ఎలా రిలీజ్ చేస్తారనేది ప్రశ్న. నాగార్జున సినిమా నిర్మాతలు ఈ ‘ఘోస్ట్’ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో ఇప్పటికే రిజిస్టర్ చేయించి ఉంటారు. కాబట్టి నాగ్ సినిమాకి ఇబ్బంది ఉండదు. అయినా.. నాగార్జున సినిమా నిర్మాణంలో ఉందని తెలిసి కూడా కనీస అవగాహన లేకుండా కన్నడ మేకర్స్ ఇలా టైటిల్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది.

పైగా ఇది కూడా యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. నాగార్జున సినిమా షూటింగ్ పరంగా ముందంజలో ఉంది కాబట్టి రిలీజ్ పరంగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus