టాలీవుడ్ ఇండస్ట్రీలో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు కాగా కేజీఎఫ్2 సినిమాతో 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో ఆ సినిమాను మించిన కలెక్షన్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో సయ్యద్ ఫర్జానా అనే పదో తరగతి చదువుతున్న అమ్మాయి నటించింది.
“కాటేరమ్మ కొడుకును పంపింది” డైలాగ్ తో ఈ అమ్మాయి పాపులర్ అయింది. ఫర్జానా ప్రమోషన్స్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఫ్రెండ్లీగా, కూల్ గా ఉంటారని ఫర్జానా చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లలో, యాడ్స్ లో తాను నటించానని ఎ సర్టిఫికెట్ మూవీ కావడంతో తన ఫ్రెండ్స్ ఇంకా సినిమాను చూడలేదని ఫర్జానా కామెంట్లు చేశారు.
అడిషన్ కు హాజరై తాను సలార్ కు సెలెక్ట్ అయ్యానని కళ్లను చూసి ప్రశాంత్ నీల్ సినిమాలోని సురభి పాత్ర కోసం ఎంపిక చేశారని ఆమె అన్నారు. ప్రభాస్ సినిమాలో యాక్టింగ్ అంటే మొదట టెన్షన్ పడ్డానని ఫర్జానా కామెంట్లు చేశారు. నితిన్ సినిమా కోసం తాను అడిషన్ ఇచ్చానని ఫర్జానా వెల్లడించారు. టెన్షన్ పడితే ప్రశాంత్ నీల్ మాట్లాడి కూల్ చేసేవారని ఫర్జానా కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నితిన్ సినిమాకు సయ్యద్ ఫర్జానా కచ్చితంగా సెలెక్ట్ అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలోని ఫర్జానా లుక్ కు రియల్ లైఫ్ లో లుక్ కు చాలా తేడా ఉందని రియల్ లైఫ్ లో ఫర్జానా మరింత అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సలార్ టీం సంప్రదించి ఈ సినిమాకు ఎంపిక చేయడం జరిగిందని ఫర్జానా కామెంట్లు చేశారు. ఫర్జానా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!