Pushpa 2: ‘పుష్ప’ షూటింగ్ కి గడ్డం అడ్డం.. మేకర్స్ ఏం చేసారంటే?
August 23, 2024 / 04:35 PM IST
|Follow Us
కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ (Allu Arjun) గడ్డం ట్రిమ్ చేసుకున్నాడు. అది పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రాజెక్టుని అతను కంప్లీట్ చేయాల్సి ఉంది. అతని మేకోవర్ గడ్డం చాలా కీలకం. ఆ రగ్డ్ లుక్ అనేది.. పాత్రకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. అయితే షూటింగ్ కంప్లీట్ అవ్వకుండా.. అల్లు అర్జున్ గడ్డం తీసేయడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తో గొడవ పడటం వల్ల.. కోపంతో అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు అనేది అందరి అభిప్రాయం.
Pushpa 2:
దానికి అల్లు అర్జున్ కి సన్నిహితుడు అయినటువంటి నిర్మాత బన్నీ వాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వడం వల్ల.. షూటింగ్ కి గ్యాప్ ఉండటంతో అతను కొంత ట్రిమ్ చేసుకుని ఫ్యామిలీ ట్రిప్ కి విదేశాలకు వెళ్ళాడు అంటూ.. బన్నీ వాస్ (Bunny Vasu) చెప్పుకొచ్చాడు. అయితే ‘పుష్ప 2 ‘ షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. అల్లు అర్జున్ ఎపిసోడ్స్ ని ముందుగానే ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్.
ఈ క్రమంలో అల్లు అర్జున్ పార్ట్ కి గడ్డం అడ్డం అయ్యింది. దీంతో ముంబై నుండి ఓ స్పెషలిస్ట్ ను పిలిపించి, బన్నీకి ఆర్టిఫీషియల్ గా గడ్డం సెట్ చేయించినట్టు సమాచారం. అది కృత్రిమంగా ఉన్నప్పటికీ.. చూడటానికి ఒరిజినల్ గానే కనిపిస్తుందట. దీనికోసం టీం అక్షరాలా రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నారట. అంటే బన్నీ కోపం ఖర్చు రూ.40 లక్షలు అనమాట.