Samantha, Naga Chaitanya: రకరకాల మాటలు వినిపిస్తున్నాయ్… నిజమెంత?
October 3, 2021 / 03:15 PM IST
|Follow Us
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా నడిచిన విషయం సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం. ఈ ఇద్దరూ విడిపోనున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఆ ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పరిశ్రమ వర్గాలు, అభిమానుల్లో మరో చర్చ మొదలైంది. నిజానికి ఈ విషయం కూడా గత కొన్ని రోజులుగా అందరి నోళ్లలో నానుతున్నా… ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ పాయింట్‌గా మారింది. అదే భరణం. విడిపోతున్నందుకుగాను సమంతకు నాగచైతన్య భారీ మొత్తంలో నగదు/ఆస్తి ఇస్తున్నాడనేది టాక్.
మామూలుగా అయితే ఇలాంటి విడాకుల నేపథ్యంలో భర్త సంపాదన, ఆస్తిలో సగ భాగాన్ని భార్యకు ఇచ్చి విడాకులు సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖులు ఇలాంటి పని చేయడం చూశాం. ఇప్పుడు నాగచైతన్య – సమంత విషయంలోనూ ఇదే జరుగుతుంది అని అంటున్నారు. అయితే ఎంత మొత్తం నాగచైతన్య ఇస్తాడు అనేది తేలాల్సి ఉంది. చైతు – సమంత విడాకుల అంశం బయటకు వచ్చినప్పుడే… ₹200 కోట్లు అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అంటే వివాహ బంధాన్ని ముగిస్తున్నందుకు సమంతకు చైతన్య భరణంగా ₹200 కోట్లు ఇస్తున్నాడనేది ఆ వార్తల సారాంశం.
ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలాగే… కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇక్కడే మరో మాట కూడా వినిపిస్తోంది. ఆ లెక్కల ప్రకారం చూస్తే… భరణం కింద సమంతకు ₹300 కోట్ల విలువైన ఆస్తి వాటా, నగరంలోని ఓ ఖరీదైన విల్లా దక్కనున్నాయట. అయితే ఈ భరణం విషయం అధికారికంగా బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు. జెఫ్ బిజోస్ లాంటి వ్యాపారవేత్త విషయంలో లెక్కలు పూర్తిగా బయటకు వచ్చాయి. మరి సామ్, చైతన్య విషయంలోనూ అలానే వ్యవహరిస్తారా అనేది ఆలోచించాల్సిన అంశం. అయితే ఇప్పటికే ఈ లెక్కలు కూడా తేలిపోయాయి అనేది లేటెస్ట్ పుకారు.