టాలీవుడ్ విలన్ అజయ్ భార్య.. హీరోయిన్స్ కు తక్కువేమి కాదు
February 6, 2021 / 05:57 PM IST
|Follow Us
టాలీవుడ్ లో విలన్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో అజయ్ ఒకరు. విక్రమార్కుడు, ఒక్కడు, సై, గబ్బర్ సింగ్, దూకుడు వంటి సినిమాలతో డిఫరెంట్ పాత్రలతో తన స్థాయిని పెంచుకున్నాడు. నెగిటివ్ రోల్ అయినా పాజిటివ్ పాత్ర అయినా అజయ్ తనదైన శైలిలో న్యాయం చేయగలడని చాలా సార్లు నీరూపించుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే అతని భార్యను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆమె ఒకప్పుడు మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొంది.
తన పేరు శ్వేతా. అజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఒకప్పుడు మోడల్ గా అడుగులు వేసింది. ఇక అజయ్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. అయినప్పటికీ ఆమె నిత్యం వర్కౌట్స్ చేస్తూ హీరోయిన్స్ కంటే తక్కువేమి కాదు అనేలా ఫిట్నెస్ ను మెయింటైన్ చెట్టున్నారు. అజయ్ సపోర్ట్ తో ఆమె ఫ్యాషన్ డిజైనర్ కోర్సును కూడా విజయవంతంగా పూర్తి చేశారు. పెళ్లయినా కూడా ఆమె ఇంకా రెగ్యులర్ మోడల్ లానే దర్శనమిస్తున్నారు.
ఇక అజయ్ ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాటలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.