Suman: సుమన్ జైలుకు వెళ్లడం విషయంలో ఏకంగా ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?
August 1, 2023 / 08:18 PM IST
|Follow Us
ప్రముఖ సీనియర్ నటులలో ఒకరైన సుమన్ వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు కాగా తెలుగులో ఇప్పటికీ ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సుమన్ ను అభిమానించే వాళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది. ఒకవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తూ సుమన్ సత్తా చాటుతున్నారు. సుమన్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. అయితే సుమన్ కు హీరోగా మంచి గుర్తింపు వచ్చిన సమయంలో ఆయన ఒక వివాదంలో చిక్కుకోవడం వల్ల ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు.
సుమన్ ఈ కేసులో చిక్కుకోవడం విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. చిరంజీవి వల్ల సుమన్ జైలుకు వెళ్లారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే సుమన్ జైలుకు వెళ్లడం వెనుక సీఎం ఎంజీఆర్ ఉన్నారని తెలుస్తోంది. అప్పటి డీజీపీ కూతురు సుమన్ ను ఇష్టపడటం డీజీపీకి నచ్చలేదని సీఎం ద్వారా సుమన్ కు చెప్పించాలని డీజీపీ ప్రయత్నించగా సీఎం మాటను కూడా సుమన్ లెక్క చేయలేదని సమాచారం..
సుమన్ స్నేహితులలో ఒకరు ప్రముఖ లిక్కర్ కాంట్రాక్టర్ కూతురితో ప్రేమలో ఉండటం కూడా సీఎం, డీజీపీని బాధ పెట్టిందని తెలుస్తోంది. అందువల్ల సుమన్ తప్పు చేయకపోయినా తెలివిగా ఆయనను ఈ కేసులో ఇరికించారని సమాచారం. ప్రముఖ డైరెక్టర్ సాగర్ ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. సుమన్ ఆ కేసులో ఇరుక్కున్న తర్వాత ఆస్తులకు సంబంధించి స్నేహితులు మోసం చేశారని సమాచారం అందుతోంది.
సుమన్ (Suman) జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయన పేరు మీద ఆస్తులు లేకుండా చేశారట. సుమన్ ఆ తర్వాత కొంతమంది చేసిన సహాయం వల్ల కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. సుమన్ ను సోషల్ మీడియాలో సైతం పాపులారిటీ పెరుగుతోంది.