కన్నీటి కష్టాలు చెప్పుకున్న బలగం నటుడు.. బీడీలు ఏరుకున్నానంటూ?

  • April 25, 2023 / 12:00 PM IST

బలగం సినిమాతో గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో కర్తానందం ఒకరనే సంగతి తెలిసిందే. ఈ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనది సూర్యాపేట అని ఖమ్మం జిల్లాలో పదో తరగతి వరకు చదువుకున్నానని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పోషించిందని కర్తానందం కామెంట్లు చేశారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. నేను వేసిన నాటకాల వల్ల చదువుకునే రోజుల్లోనే జలగం వెంకట్రావు చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్నానని ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడం వల్ల నేను కూలి పనులు చేశానని ఆయన తెలిపారు.

ఎన్నో బాధలు అనుభవించానని తాగుడుకు బానిసయ్యానని ఏ పని చేసినా కలిసిరాలేదని కర్తానందం కామెంట్లు చేశారు. రోడ్డు పక్కన ఎంగిలి బీడీలు ఏరుకుని తాగానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఎందుకు ఈ బ్రతుకు అని అనిపించిందని మా స్నేహితులను ఆశ్రయించి సహాయం కోరానని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో పోలీస్ శాఖ ప్రతి జిల్లాకు కళా బృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసిందని ఆ కళా బృందానికి హోం గార్డ్ గా పని చేయాలని వాళ్లు కోరారని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలలో నటించానని కర్తానందం కామెంట్లు చేశారు. చాకలి ఐలమ్మ సినిమా వల్ల జబర్దస్త్ రాజమౌళితో నాకు పరిచయం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ఆయన ద్వారా వేణు టీమ్ లో చేరి 200 ఎపిసోడ్లు చేశానని కర్తానందం పేర్కొన్నారు. వేణు నా దేవుడని ఆయన బలగం (Balagam) మూవీలో ఛాన్స్ ఇచ్చాడని కర్తానందం వెల్లడించారు.

ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కర్తానందం కామెంట్లు చేశారు. కర్తానందం వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్తానందం కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus