ప్రముఖ నటుడు నగేష్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

  • March 2, 2021 / 04:59 PM IST

సినీ పరిశ్రమలో ఇగోలు ఉండవు అని స్టేజిల స్టార్ హీరోలు చెబుతుంటారు కానీ.. అదంతా నామ మాత్రంగానే అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ పెద్ద వాళ్ళ మాటలను సాధారణ నటులు లెక్క చెయ్యకపోతే.. వాళ్లకు లైఫ్ లేకుండా పోతుంది అనడం వాస్తవం. సందర్భం వచ్చింది కాబట్టి.. దీనికి ఒక ఉదాహరణగా మనం ప్రముఖ నటుడు నగేష్ గారి గురించి చెప్పుకుందాం. ఇలా చెబితే.. ఎవ్వరికీ పెద్దగా స్ట్రైక్ అవ్వదేమో. అందుకే ‘తొలిప్రేమ’ సినిమా పవన్ కళ్యాణ్ పెదనాన్నగా చేసిన నగేష్ అనగానే అందరికీ ఇట్టే తట్టేస్తుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కు నగేష్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.

సరే ఇక నగేష్ గారి గురించి చెప్పుకుంటే.. కెరీర్ ప్రారంభంలో రైల్వే ఉద్యోగం చేసే ఈయన నాటకాలు వేసే అనుభవంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా తమిళంలో చాలా సినిమాల్లో నటించారు నరేష్ గారు. అయితే అక్కడి స్టార్ హీరో ఎం.జి.ఆర్ గారికి అలాగే నగేష్ గారికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో అక్కడి దర్శక నిర్మాతలు ఈయనకు అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టారు. అందుకే ఈయన మెల్లగా తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఆయన నటనతో ప్రేక్షకులను అలరించారు. తరువాత తమిళంలో కమల్ హాసన్ గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అవకాశాలు బాగానే సంపాదించుకున్నారు.

కానీ కొడుకు ఆనంద్ ను హీరోగా నిలబెట్టాలి అని ప్రయత్నించి సంపాదించిందంతా పోగొట్టుకున్నారట నగేష్ గారు. ఆ టైములో ఈయనకు ఓ థియేటర్ కూడా ఉండేదట. దానికి ట్యాక్స్ సరిగా చెల్లించలేదని.. ఎం.జి.ఆర్ గారు సి.యంగా ఉన్న టైములో నగేష్ గారిని జైలుకి కూడా పంపించారట. అటు తరువాత ఈయనకి అవకాశాలు రాకపోవడంతో తాగుడుకు భానిసైపోయి ఆరోగ్యం పాడుచేసుకుని మరణించినట్టు తెలుస్తుంది. ఈయన చివరిగా కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ సినిమాలో కనిపించారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus