Tamannaah: తమన్నా జాతకాలను ఇంతలా నమ్ముతారా.. ఆ అక్షరాలే లక్ తెచ్చాయా?
May 23, 2023 / 01:37 PM IST
|Follow Us
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తమన్నాకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. తమన్నా వయస్సు పెరుగుతున్నా ఆమెకు ఆఫర్లు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తమన్నా పారితోషికం ప్రస్తుతం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తమన్నాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తమన్నాతో కలిసి నటించాలని స్టార్ హీరోలు ఆశ పడుతున్నారు. కథ నచ్చితే సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అయితే ఈ బ్యూటీ జాతకాలను బాగానే నమ్ముతారని సమాచారం 8 అనే నంబర్ ను ఈమె దురదృష్టంగా ఫీలవుతారని సమాచారం. తమన్నాను అభిమానులు ఎక్కువగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. అయితే మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ తమన్నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. 13 సంవత్సరాల వయస్సులోనే తమన్నా సినీ ప్రయాణం మొదలైంది. భోళా శంకర్ సినిమాలో తమన్నా నటిస్తుండగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
కవితలు రాయడాన్ని ఈ బ్యూటీ ఎక్కువగా ఇష్టపడతారని తెలుస్తోంది. తమన్నా నిక్ నేమ్ తమ్మీ కాగా ఈ బ్యూటీ కాఫీని ఎంతగానో ఇష్టపడతారని సమాచారం అందుతోంది. తమన్నా తన పేరులో ఏ, హెచ్ లెటర్స్ ను యాడ్ చేసుకుందని తెలుస్తోంది. ఈ లెటర్స్ యాడ్ చేసుకుంటే తమన్నాకు లక్ కూడా కలిసొచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమన్నా బాలయ్య తర్వాత సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారని వార్తలు వినిపించినా ఆ వార్తలు నిజం కాలేదు.
టూరిస్ట్ ప్లేసెస్ కు వెళ్లడానికి తమన్నా (Tamannaah) ఎంతగానో ఇష్టపడతారు. సినిమా సినిమాకు తమన్నా రేంజ్ పెరుగుతుండగా తమన్నా ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర హీరోయిన్లకు భిన్నంగా తమన్నా కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్నారు.