నాగార్జున సూపర్ హిట్ సినిమా వల్ల పెళ్లిళ్లు ఆగిపోయాయట..ఎలా అంటే?
July 12, 2020 / 05:12 PM IST
|Follow Us
‘కింగ్’ నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్ సినిమాలలో ‘మన్మథుడు’ కూడా ఉంటుంది. కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2002 డిసెంబర్ 22న విడుదలయ్యింది. ‘వాట్ ఉమెన్ వాంట్’ అనే హాలీవుడ్ సినిమాని మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ప్రెజెంట్ చేశారు దర్శకుడు విజయభాస్కర్. త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి. హీరోయిన్లు సోనాలి బింద్రే, అన్షు ల గ్లామర్ తో పాటు.. బ్రహ్మానందం,సునీల్ ల కామెడీ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలిపి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టాయి.
ఇప్పటికీ ఈ చిత్రాన్ని బుల్లితెర పై చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అయితే ఈ చిత్రం వచ్చినప్పటి నుండీ కొన్ని పెళ్లి సంబంధాలు సెట్ అవ్వడం లేదట. అదెలా అనుకుంటున్నారా? ఈ చిత్రంలో హీరోయిన్ సోనాలి బింద్రే హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటుంది. ఆమెకు పెళ్లి కూడా సెట్ అవుతుంది. అయినప్పటికీ మధ్యలో నాగార్జునతో ప్రేమలో పడుతుంది. ఇక క్లయిమాక్స్ లో ఇతని కోసం పెళ్లి ఆపేసుకుని మరీ నీళ్లలో దూకేస్తోంది. అప్పటి నుండీ కొన్ని పల్లెటూర్లలో.. ‘సిటీలో ఉండే అమ్మాయిలను మాత్రం తమ ఇంట్లో అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చెయ్యకూడదు’ అని డిసైడ్ అయ్యారట.
ఈ చిత్రం వచ్చినప్పటి నుండీ అసలు ‘సిటీలో ఉన్న అమ్మాయిలు మాత్రం వద్దు’ అంటూ పల్లెటూరిలో ఉండే అబ్బాయిల తల్లిదండ్రులతో పాటు సిటీలో జాబ్ లు చేసుకునే కొంత మంది అబ్బాయిలు కూడా ఫిక్స్ అయిపోయారట. ‘మన్మధుడు’ చిత్రానికి పనిచేసిన ఓ టెక్నిషియన్ తన సొంత ఊరిలో ఇలాంటి కామెంట్స్ విన్నాక..అతను ఈ విషయాన్ని నాగార్జునకు అలాగే దర్శకుడు విజయ్ భాస్కర్ కు చెప్పాడట. దాంతో వాళ్ళు కూడా.. ‘మనకి తెలియకుండానే ఇంత మెసేజ్ ఇచ్చేసామా?’ అని సరదాగా నవ్వేసుకున్నారట. నిజానికి ఎన్నో సినిమాల్లో.. సిటీలో ఉన్న అమ్మాయిలు పల్లెటూరి అబ్బాయిలను ప్రేమించినట్టు చూపించారు. కానీ విచిత్రంగా ‘మన్మథుడు’ చిత్రం మాత్రమే వారిని ప్రభావితం చేసింది.