తమిళ తంబిలను నమ్ముకొని బొక్కబోర్లాపడుతున్న హీరోలు!

  • October 7, 2018 / 03:29 AM IST

“ఇంట గెలిచి రచ్చ గెలవాలి” అని పెద్దలు అన్న మాటను మన కథానాయకులు కాస్త సీరియస్ గా తీసుకొంటున్నారు ఈమధ్య. అయితే.. ఆ ప్రయత్నంలో రచ్చ గెలవడం పక్కన పెడితే.. ఇంట కూడా ఓడిపోతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో తమిళ డెబ్యూగా చేసిన నోటా నిన్న విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో విజయ్ తప్ప మరేదీ కూడా ప్రేక్షకుడికి రుచించే విధంగా లేకపోవడంతోనే ఆ సినిమాకి అలాంటి నెగటివ్ టాక్ వచ్చింది. నోటా ప్రీ రిలీజ్ కు ముందు ఉన్న క్రేజ్ వల్ల, విజయ్ స్టార్ క్రేజ్ వాళ్ల ఓపెనింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బాగానే వస్తున్నా వీకెండ్ అవ్వగానే డ్రాప్ చాలా దారుణంగా ఉండబోతోందని ట్రేడ్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది.

పది సినిమాలు కూడా దాటకుండానే తమిళ ప్రేక్షకుల ముందు కూడా ప్రూవ్ చేసుకోవాలన్న ఆశతో ఉన్న విజయ్ కి నోటా దెబ్బేసింది. ఇక తమిళం కూడా నేర్చుకుని..అనర్గళంగా తమిళం మాట్లాడి అక్కడి ప్రేక్షకులను పడేసాడు. కానీ తెలుగు ప్రేక్షకుల దగ్గర ఎంతో క్రేజ్ సంపాదించిన విజయ్. ఇప్పుడు వారి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నోటా డబ్బింగ్ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకులు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఎంతో క్రేజ్ ఉన్న మహేష్ బాబు 23 సినిమాల అనుభవం తర్వాత స్పైడర్ తో తమిళంలోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ తమిళనాట గొప్పగా పేరు తెచ్చుకోకపోగా.. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా మహేష్ లాగే అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus