Ponniyin Selvan1: ‘పొన్నియన్ సెల్వన్ -1’ నచ్చలేదు అంటే నేరం చేసినట్టా..!
October 1, 2022 / 02:19 PM IST
|Follow Us
ఒక సినిమా బాలేదు అనడంలో తప్పేమి ఉండదు. ఎవరికి వారికి ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. ఓ బాషలో హిట్ అయిన సినిమా అన్ని భాషల జనాలకు నచ్చాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ అట్టర్ ప్లాప్ అయిన ఆంధ్రావాలా సినిమా కన్నడంలో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక్కడ ప్లాప్ అయిన సాహో సినిమా హిందీలో సూపర్ హిట్ అయ్యింది.తెలుగులో హిట్ అయిన శ్రీమంతుడు సినిమా తమిళంలో ప్లాప్ అయ్యింది.
అయితే స్పైడర్ సినిమా తమిళ జనాలకు నచ్చింది. ఎందుకంటే అది తమిళ ఫ్లేవర్ తో రూపొందిన సినిమా..! రాష్ట్రాలకు తగ్గట్టు ప్రజల విభిన్నంగా ఉంటాయి. దానిని తప్పుబట్టాల్సిన పనేమీ లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. ఈరోజు రిలీజ్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీకి తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. మన జనాలకు ఆ మూవీ నచ్చలేదు. మణిరత్నం కోసం పెద్ద ఎత్తున ఆ సినిమాని థియేటర్లో చూడాలని జనాలు భావించారు.
కానీ అది మన ఫ్లేవర్ మూవీ కాదు. చోళ రాజ్యం, పాండ్యుల రాజ్యం అంటే అక్కడి జనాలకు తెలిసుండొచ్చు. మన జనాలకు తెలీదు. పైగా ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, బాహుబలి లా హై మూమెంట్స్ ఏవీ లేవు. కాబట్టి మన జనాలకు ఆ మూవీ నచ్చకపోవచ్చు. అలా అని సినిమా బాగుంది అని చెప్పినవాళ్లు లేరా అంటే.. అలా కూడా లేదు. కొంతమంది జనాలకు నచ్చింది కూడా..! ఈ మాత్రం దానికి ‘ఓ పెద్ద తమిళ సినిమాని తెలుగులో ఆదరించడం లేదు, తొక్కేస్తున్నాం’ అంటూ ఓ తమిళ నటుడు ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్ వేశాడు.
అంతేకాదు ‘మాకు టైం వస్తుంది అప్పుడు మేము కూడా వాంటెడ్ గా మీ సినిమాల సంగతి చూస్తాం’ అన్నట్టు హెచ్చరించాడు. అతను మరెవరో కాదు ప్రశాంత్ రంగస్వామి. ఇతని ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఇతన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తమిళంలో ప్లాప్ అయిన ‘మాస్టర్’ వంటి సినిమాని మన తెలుగులో హిట్ చేసిన సందర్భాలను ఇతను మర్చిపోయినట్టు ఉన్నాడు.