సమంత గురించి వస్తున్న ఈ నాలుగు రూమర్లలో నిజమెంత

  • August 26, 2019 / 12:05 PM IST

ఇండస్ట్రీ వ్యక్తుల గురించి ముఖ్యంగా హీరోహీరోయిన్ల గురించి ఇండస్ట్రీలో బోలెడన్ని రూమర్లు వస్తుంటాయి. హీరోల గురించి అయితే ఫలానా హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని వస్తాయి. అదే హీరోయిన్ అయితే ఫలానా హీరోతో డేటింగ్ చేస్తోందనో లేక ఎవరితోనో లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందనో వార్తలు వస్తుంటాయి. కానీ.. సమంత పెళ్లి అయిపోయిన స్టార్ హీరోయిన్, అందులోనూ అక్కినేని కుటుంబం కోడలు. దాంతో ఆమెపై ఇదివరకూ పైన పేర్కొన్న తరహాలో గాసిప్పులు వచ్చినా.. ఈమధ్యకాలంలో అలాంటివేమీ సృష్టించలేదు గాసిప్పు రాయుళ్ళు. అయితే.. టాప్ హీరోయిన్స్ లో ఒకరైన సమంతపై ఏదో ఒక రూమర్ లేకపోతే ఎలా చెప్పండి. ప్రస్తుతం సమంత గురించి ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ ఉన్నాయి.

అందులో ముఖ్యమైనది సమంత నటనకి బ్రేక్ ఇవ్వనుందని. అయితే.. ఆ విషయానికి వరుస సినిమా లు సైన్ చేసి సమాధానం ఇచ్చేసింది సామ్. ఆ తర్వాత ఆమె జిమ్ లో చేస్తున్న ఫీట్లు చూసి సమంత ఏదో వెబ్ సిరీస్ సైన్ చేసిందని కూడా వార్తలొచ్చాయి. అయితే.. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలే తాను యాక్సెప్ట్ చేయడం లేదని.. అలాంటిది వెబ్ సిరీస్ ఎందుకు చేస్తాను అని క్లారిటీ ఇచ్చేసింది సమంత. ఇక ఆఖరిది.. “బంగార్రాజు” చిత్రంలో నాగార్జునతోపాటు నాగచైతన్య, సమంత కీలకపాత్రలు పోషించనున్నారని. ఈ మూడో రూమర్ కి కూడా సమంత ఒక క్లారిటీ ఇచ్చేసిందంటే.. ఆమెపై ఉన్న రూమర్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus