Bheemla Nayak Collections: రూ.100 కోట్లు షేర్ పోస్టర్స్ లో నిజమెంత..?

  • March 7, 2022 / 03:56 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ లభించింది. దాంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ‘భీమ్లా నాయక్’. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ… పవన్ సినిమా కలెక్షన్లను దెబ్బ కొట్టాలని టికెట్ రేట్లను తగ్గిస్తూ ఎమ్మార్వో లను, విఆర్వో లను, సి.ఆర్.పి ఎఫ్ సిబ్బందిని పెట్టి మొత్తంగా రూ.3 కోట్లు ఖర్చు పెట్టి మరీ కక్ష సాధింపు చర్యలను చేపట్టింది.

బెనిఫిట్ షోలు వంటివి కూడా లేకుండా చేసింది. అయితే ప్రభుత్వం ప్లాన్స్ ఏమీ ఫుల్ గా వర్కౌట్ కాలేదు. చాలా చోట్ల ఎమ్మార్వో లను, విఆర్వో లను, సి.ఆర్.పి ఎఫ్ సిబ్బందిని థియేటర్ ఓనర్ల వద్ద అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల వద్ద డబ్బులు తీసుకుని అక్కడి నుండీ వెళ్లిపోయారు. దాంతో చాలా చోట్ల టికెట్ రూ.500 కి పైగా అమ్మారు అనేది వాస్తవం. ఏది ఎలా ఉన్నా..

‘భీమ్లా నాయక్’ తొలివారం రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. అయితే 2వ వీకెండ్ ‘భీమ్లా నాయక్’ అనుకున్న స్థాయిలో రాబట్టలేదు. శుక్ర, శని, ఆదివారాలు కలుపుకుని ఒక రూ.5 కోట్ల లోపు షేర్ ను మాత్రమే నమోదు చేసింది. అయితే సడెన్ గా ‘భీమ్లా నాయక్’ రూ.100 కోట్లు షేర్ రాబట్టినట్టు పోస్టర్లు ట్రెండ్ అవుతున్నాయి.

వాటి ప్రకారం అయితే రెండో వీకెండ్ కు ‘భీమ్లా’ రూ.15 కోట్లు షేర్ ను రాబట్టినట్టు లెక్క. కానీ అలా జరగలేదు. మరి పోస్టర్స్ లో ఆ లెక్కలు ఎందుకు కనిపిస్తున్నట్టు. పైగా లేని షేర్ ను ఉన్నట్టు చెప్పుకుంటే ‘భీమ్లా నాయక్’ పై ఏపి ప్రభుత్వం ఇష్టమొచ్చిన ట్యాక్స్ వేసే ప్రమాదం కూడా ఉంటుంది. అదీ కాక ‘భీమ్లా నాయక్’ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మొత్తంగా రూ.110 కోట్ల షేర్ ను రాబట్టాలి. హిందీ వెర్షన్ కూడా

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus