RGV vs Perni Nani: రాంగోపాల్ వర్మ మీటింగ్ పై సెటైర్ల వర్షం..!
January 11, 2022 / 11:21 AM IST
|Follow Us
ఏపీలో థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారవ్వుతుంది. అక్కడి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పై పగ సాధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కూడా సైలెంట్ అయిపోయారు. చిరంజీవి లాంటి వారు ‘నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. అండగా ఉంటాను’ అని చెప్పి సైడ్ అయిపోయారు.అయితే కొద్ది రోజులుగా రాంగోపాల్ వర్మ టిక్కెట్ రేట్ల ఇష్యు పై లాజిక్ ల ప్రకారం ప్రశ్నలు అడుగుతూ.. ఏపి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఫైనల్ గా వివాదానికి తెరదించాలని…
పేర్ని నానితో వర్మ భేటీ అవుతున్నట్టు తెలుపడంతో అంతా సంతోషించారు. ఈ సమస్యకి ఓ పరిష్కారం దొరుకుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టే.. వర్మ కూడా పేర్ని నానితో జరిగిన మీటింగ్ ను బాగా ఎంజాయ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ‘ఒక ఫిలిం మేకర్ గా.. సినిమా క్వాలిటీ అనేది తక్కువ టికెట్ రేట్ల వల్ల దెబ్బతింటుంది అనే విషయాన్ని వివరించడం కోసం నేను ఈ మీటింగ్‌లో పాల్గొన్నాను. అంతే తప్ప నేను డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించడానికి కాదు.
పేర్ని నాని గారితో జరిగిన మీటింగ్ బాగా జరిగిందని భావిస్తున్నాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. లంచ్‌కు ముందు రెండు గంటలు.. లంచ్ తర్వాత రెండు గంటల చొప్పున వీళ్ళు మాట్లాడుకున్నారట.మీటింగ్ అయ్యాక ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. లంచ్ లో భాగంగా వర్మకి రొయ్యల వేపుడు, మటన్, చికెన్లతో ప్లెయిన్ బిర్యానీ .. మంత్రి పేర్ని వడ్డించారట. ఆ తర్వాత పేర్ని నాని .. ‘టిక్కెట్ రేట్ల అంశం గురించి ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని చెప్పడం కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.
ఆ కమిటీకి వాళ్ళకే చెప్పుకోవాలన్నారు. ఆ కమిటీలో నేను భాగం కాదని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా..మేము అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని.. సినిమాటోగ్రఫీ చట్టం గురించి ఏదో తెలిసినట్టు ఆయన వర్మ వెళ్ళిపోయాక చెప్పారు. ఫైనల్ గా వీళ్ళ మీటింగ్ వల్ల ప్రయోజనం ఏమీ లేదని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.