కంటెంట్ కంటే కోట్లే ముఖ్యమనుకుని అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా తెరకెక్కించిన సినిమా ఏదంటే..?

  • January 6, 2023 / 06:41 PM IST

ఏదైనా ఓ సినిమాకి కథ ప్రకారం ఖర్చు పెడితే తప్పు లేదు కానీ.. కేవలం కాంబినేషన్‌ కారణంగానో, లేక హీరోగా నిలబడాలనో, నిలబెట్టాలనో భారీగా ఖర్చు పెడితే ఫలితం గోడకొట్టిన బంతి అంత వేగంగా వచ్చి తిరిగి కొడుతోంది.. సౌత్, నార్త్‌లో ఇలా భారీతనంతో వచ్చి బాక్సాఫీస్ బరిలో బొక్కా బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో దాదాపు ఏడేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని.. అప్పటికే అదే హెవీ బడ్జెట్ పైగా ‘డిజాస్టర్ కా బాప్’ అనిపించుకున్న ఓ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం..

బోనీ కపూర్.. బాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్.. తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి భర్త.. తమ్ముడు అనిల్ కపూర్ స్టార్ హీరో.. 1987లో తమ్ముడిని పెద్ద హీరోగా చూడాలని శ్రీదేవిని కథానాయికగా పెట్టి.. బోనీ కపూర్ రూ.3 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘మిస్టర్ ఇండియా’ హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఈసారి అంతకుమించి అంటే రూ.7 కోట్లతో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు.. అదే ‘రూప్‌కీ రాణీ – చోరోంకా రాజా’.. సతీష్ కౌశిక్ డైరెక్టర్..

1987లో మొదలైన సినిమా షూటింగ్ దాదాపు ఆరేళ్లకు పైగా జరిగింది.. చివరకు 1993లో విడుదలైంది. ఇది పాత రికార్డులను తిరగరాస్తుందనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది. సరైన ప్లానింగ్, ఆలోచన లేకపోవడం వల్లే బడ్జెట్ పెరిగిందని.. దానికి కారణం బోనీ కపూర్ నిర్లక్ష్యమేనని ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆరోపించారు. అంతే కాదు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఈ చిత్రం చర్చనీయాంశమైంది..

హీరోయిన్ కాస్ట్యూమ్స్, ఆమె ధరించే ఆభరణాలను పదే పదే మార్చడం, రిచ్ సెట్స్, చివరికి డ్యాన్సర్ల కాస్ట్యూమ్స్ కూడా మార్చడం.. ఇలా పలు కారణాలతో అనవసరపు ఖర్చు పెరిగిపోయింది. అప్పటి వరకు అనిల్ మీద వచ్చినదంతా తెచ్చి ఈ ప్రాజెక్ట్‌పైన కుమ్మరించాడు బోనీ కపూర్.. ‘మిస్టర్ ఇండియా’ తర్వాత దాన్ని మించిన సినిమాగా చెప్పుకుంటారు అనుకుంటే.. ‘డిజాస్టర్ కా బాప్’ అనే ముద్ర వేసేశారు.. నిర్మాతతో సహా పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కూడా దారుణంగా నష్టపోయారు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus