ఉత్తరాదిన సక్సస్ అయినా బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాది ప్రజలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో బాగా సక్సస్ అయింది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు షోలో రోజురోజుకి వేడి రాజుకుంటోంది. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ షో కూడా అందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. అయితే అక్కడ షో సెట్ లో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ తమిళ వెర్షన్ల సెట్ లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల్లో గుణశేఖరన్ అనే వ్యక్తి పని చేస్తూనే.. హౌస్ రెండవ అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు. బాగా ఎత్తు నుంచి పడటంతో తలకి తీవ్రగాయం అయి, బాగా రక్త స్రావం జరిగింది.
బిగ్ బాస్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే గుణశేఖరన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విష్యం తెలుసుకున్న నెటిజనులు గుణశేఖరన్ కుటుంబసభ్యులను షో నిర్వహులు ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో కమల్ హాసన్ చొరవ తీసుకొని సాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్చలు సాగుతున్నాయి. ఈ ఘటనతో తెలుగు బిగ్ బాస్ షో నిర్వహలు అలర్ట్ అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని టెక్నీషియన్స్, వర్కర్స్ కి సూచించారు.