Actress Alia Bhatt: స్టార్ హీరోయిన్ ని టార్గెట్ చేసిన నెటిజన్లు!
December 9, 2021 / 05:33 PM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈరోజు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఓ పక్కన వీరి పెళ్లితంతు జరుగుతుంటే.. మరోపక్క ఊహించని విధంగా అలియా భట్ పై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోబోతున్న కత్రినా కైఫ్, గతంలో రణబీర్ కపూర్ ప్రేయసి. ఇద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే సీన్ లోకి అలియా భట్ ఎంటర్ అవ్వడంతో వాళ్లకి బ్రేకప్ జరిగింది.
ఆ తరువాత విక్కీకౌశల్ కి కనెక్ట్ అయింది కత్రినా. అలా ఈ పెళ్లికి, అలియాభట్ ను కనెక్షన్ ఏర్పడింది. పెళ్లికి అలియాభట్ ను ఇన్వైట్ చేశారా..? లేదా..? అనే విషయాన్ని పక్కన పెడితే ఆమె మాత్రం వెళ్లలేదని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది అలియా. దీంతో నెటిజన్లు ఆమెని అవమానిస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అలియాకు కత్రినా ఇన్విటేషన్ పంపించి ఉండదంటూ ఎగతాళి చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
కానీ అలియా మాత్రం ఈ ట్రోలింగ్ పై స్పందించలేదు. ఇక కత్రినా పెళ్లి విషయానికొస్తే.. ఈరోజు పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరగనుంది. ఆ తరువాత క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.