Actress Roja: ఎమ్మెల్యే రోజాపై నెటిజన్ల ట్రోలింగ్.. ఏమైందంటే..?

  • June 12, 2021 / 11:38 AM IST

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కు భారీగా టీఆర్పీ రేటింగ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో సైతం ఈ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రోజా ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ షో ద్వారానే అనసూయ, రష్మీలకు యాంకర్లుగా మంచి గుర్తింపు దక్కింది.

జబర్దస్త్ షోలో రోజా వేసే పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సర్జరీలు చేయించుకోవడం వల్ల రోజా కొన్ని వారాలు జబర్దస్త్ షోకు దూరమైనా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి జడ్జిగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా రోజా చేసిన ఒక పని వల్ల నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. జూన్ నెల 4వ తేదీన ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో రోజా వేసుకున్న డ్రెస్ నెటిజన్ల ట్రోలింగ్ కు కారణమైంది.

రోజా వేసుకున్న డ్రెస్ నైటీలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వకీల్ సాబ్ మూవీలో లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్పిన డైలాగులతో మీమ్స్ చేసి “లేచేసరికి లేట్ అయింది.. ఏది అయితే అది అయిందని నైటీలో జెట్ స్పీడ్ లో వచ్చేశాను” అని రోజా చెప్పినట్టు వైరల్ అవుతున్న మీమ్ తో రోజాను ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై రోజా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు రోజా జబర్దస్త్, ఎక్స్టా జబర్దస్త్ షోలలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus