ఈ కొత్త డ్రామాలు ఏంటి? బెల్లంకొండ, కాజల్ పై ట్రోలింగ్..!
July 15, 2020 / 09:40 PM IST
|Follow Us
ఓ హీరో, హీరోయిన్ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ రూమర్స్ రావడం మనం చూస్తూనే వస్తున్నాం. అదే హీరో, హీరోయిన్లు వరుసగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు అంటే.. ఇక ఆ రూమర్స్ కన్ఫార్మ్ అని అంతా ఫిక్సయిపోతుంటారు. ‘కానీ అది కేవలం ఆ సినిమాల పై క్రేజ్ ఏర్పడేలా చెయ్యడం కోసం.. చిత్ర యూనిట్ సభ్యులే ఇలాంటి వార్తలు రాయిస్తుంటారు అనే టాక్ కూడా వినిపిస్తుంటుంది.
ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ వంటి షో లలో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తునారు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంస్కృతి బాలీవుడ్ లో అయితే ఎప్పటినుండో ఉంది అంటూ ఓ ఉదాహరణ కూడా చెబుతున్నారు. అందులో నిజమెంతో ఎవ్వరికీ తెలీదు. సరే ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే.. ‘కవచం’ ‘సీత’ వంటి సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్నప్పుడు కూడా.. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టు వార్తలు వినిపించాయి.
అయితే ఈ సినిమాలు ఫినిష్ అయిన తరువాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ తాజాగా కాజల్.. ‘బెల్లంకొండ శ్రీనివాస్ ను మిస్ అవుతున్నట్టు’.. ఓ పాత ఫోటోని పోస్ట్ చేసింది. దానికి బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రిప్లై ఇచ్చాడు. ‘నేను కూడా నిన్ను మిస్సవుతున్నానని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవమంటే ఎలా?’ అంటూ రొమాంటిగ్గా స్పందించాడు. దీంతో వీళ్ళు మళ్ళీ వార్తల్లో నిలిచారు.