విష్ణు విశేషం చెప్పుకుంటే .. మెసేజ్లు ఇస్తున్నారు

  • August 9, 2019 / 04:36 PM IST

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణుకి ఈ శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా హీరో మంచు విష్ణునే ట్విట్టర్లో తెలిపాడు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం. వీరిలో అవియానా, వివియానా కవలలు కాగా కొడుకు అవ్రమ్ ఉన్నాడు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి తండ్రి కావడంతో సోషల్ మీడియాలో సినిమా ప్రముఖులతో పాటు అభిమానుల నుండీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ క్రమంలో కొందరు నెటిజన్లు మాత్రం విష్ణుపై సెటైర్లు వేస్తున్నారు. ‘ఉద్యమం అయిపోయిందా..? ఇంకా ఉందా..?’ అంటూ కొందరు కామెంట్లు పెట్టడం కాస్త అతికి దారి తీసింది. ‘మీకు పిల్లలు కావాలంటే ఎవర్నైనా దత్తత తీసుకోండి’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు’. అవి మంచి మాటలే కావచ్చు.. కానీ ఇలా ఒకరి పెర్సనల్ లైఫ్ లో కలుగచేసుకుని మెసేజ్లు ఇవ్వడం మంచి పరిణామం కాదనే చెప్పాలి. కొందరు నెటిజన్లు మాత్రమే ఇలా కామెంట్లు చేస్తున్నారు. ఒక్కోసారి కొంతమంది సెలెబ్రిటీలు సహనం కోల్పోయి వీరి పై ఫైరవుతున్నా వారు ఆగట్లేదు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus